ఓ ఊహా!

(మనసుకుమేత)


మెరుపులా

మదినితట్టరాదా

తారలా

తళుకులాడరాదా


సీతాకోకలా

కనిపించరాదా

చిలుకలా

పలికించరాదా


ఉయ్యాల్లా

ఊపరాదా

కెరటాల్లా

ఎగిసిపడరాదా


తేనెటీగల్లా

తుట్టెనుకట్టరాదా

తూనీగల్లా

గుంపుగారారాదా


కోకిలలా

కూయరాదా

రాయంసలా

నడుపరాదా


గాలిలా

ప్రసరించరాదా

నీరులా

ప్రవహించరాదా


మల్లెలా

పూయరాదా

పరిమళంలా

వ్యాపించరాదా


చిగురాకులా

తొడగరాదా

మొక్కలా

మొలకెత్తరాదా


వెన్నెలలా

వేడుకపరచరాదా

అరుణబింబంలా

ఉదయించరాదా


తేనెలా

తోచరాదా

కవితలా

ఫుటకెక్కరాదా


పాఠకులను

పరవశపరుస్తా

విమర్శకులను

విస్మయపరుస్తా


గమ్యమును

చేరుకుంటా

ఙ్ఞాపకాలను

నెమరేసుకుంటా


ఊహలను

స్వాగతించుతా

మనసుకు

మేతనుపెడతా


చమక్కుచూపి

ముగించుతా

గమ్మత్తుచేసి

గడియవేసుకుంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog