అందం ఆనందం
పువ్వులు
వికసిస్తే అందం
పరిమళాలు
వెదజల్లితే ఆనందం
చెట్టు
పూస్తే అందం
దృశ్యము
పరికిస్తే ఆనందం
శశికి
వెన్నెల అందం
చల్లగాలి
తగిలితే ఆనందం
కడలికి
కెరటాలు అందం
కేరింతలు
వింటే ఆనందం
నింగికి
హరివిల్లు అందం
వర్ణాలు
వీక్షిస్తే ఆనందం
మబ్బుకి
చిరుజల్లులు అందం
చినుకులు
చిటపటమంటుంటే ఆనందం
పాపాయికి
పసిడిరంగు అందం
ముద్దుమాటలు
పలుకుతుంటే ఆనందం
నెమలికి
తోక అందం
నాట్యము
చేస్తుంటే ఆనందం
కోకిలకి
కంఠము అందం
కుహూకుహులు
వింటుంటే ఆనందం
కంటికి
చూపులు అందం
మనసుకు
ఆస్వాదన ఆనందం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment