నా కుముదిని
కుముదిని
కులుకుతుంది
ఉలుకుతుంది
పలుకుతుంది
కుముదిని
ఆడుతుంది
పాడుతుంది
అలరిస్తుంది
కుముదిని
రసమయి
రూపవతి
రాగమయి
కుముదిని
రమ్మంటుంది
రంజింపజేయమంటుంది
రసఙ్ఞతచాటమంటుంది
కుముదిని
కళకళలాడుతుంది
పకపకానవ్వుతుంది
చకచకారమ్మంటుంది
కుమిదిని
ఊయలూపుతుంది
ఊరించుచున్నది
ఉత్సాహపరుస్తుంది
కుముదిని
పట్టుకోమంటుంది
చేతిలోకితీసుకోమంటుంది
పరవశపరచమంటుంది
కుమిదిని
కవ్విస్తుంది
కలముపట్టిస్తుంది
కవితవ్రాయిస్తుంది
కుముదిని
వదలను
మరువను
తరుమను
కుముదిని
నాప్రాణము
నామానము
నాజీవితము
కుముదిని
జీవితంలోకి ఆహ్వానిస్తా
కౌముదిని
ఆకాశంలోకి స్వాగతిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment