చిన్ననాటి ఙ్ఞాపకాలు


నిన్న

మావూరెళ్ళా

పాతరోజులు

తలచుకున్నా


కొన్నిరహస్యాలను

పొట్లాంలోకట్టివేశా

కొన్నిఙ్ఞాపకాలను

మదిలోదాచిపెట్టా


రహస్యాలు

వెంటబడుతున్నాయి

ఙ్ఞాపకాలు

తరుముకొస్తున్నాయి


పొట్లాం

విప్పాలని ఉంది

దాపరికాలు

చెప్పాలని ఉంది


మారుమూల

పల్లెలోపుట్టా

కడుపేద

కుటుంబంలోపెరిగా


పూరింట్లో

జనించా

పేదింట్లో

వసించా


గుడ్డ ఉయ్యాలలో

ఊగా

తల్లి ఉగ్గుపాలతో

మాటలునేర్చా


అక్కచెల్లెల్లతో

అనురాగాలు పంచుకున్నా

అన్నదమ్ములుమిత్రులతో

ఆట్లాడి ఆనందించా


బడికి

నడిచివెళ్ళా

బాగా

చదువుకున్నా


ఇంటిచుట్టూ

మొక్కలునాటా

పుష్పాలు

పూయించా


చింతచెట్టు

ఎక్కా

లేతచిగుర్లు

కోశా


కందిచేలలోకి

వెళ్ళా

కాయలనుతెచ్చి

వండుకొనితిన్నా


జొన్నచేలలోకి

పోయా

పాలకంకులను

తిన్నా


చెరువులో

మునిగా

ఏటిలో

ఈదా


పొలాల్లో

తిరిగా

పశువులను

కాచా


కావిడి

మోసా

చెట్లను

ఎక్కా


వరలక్ష్మిని

వివాహమాడా

ఉన్నతోద్యోగాన్ని

సంపాదించా


మేడలు

కట్టా

మిద్దెల్లో

నివసించా


సుసంతానాన్ని

కన్నా

వృద్ధిలోనికి

తెచ్చా


పేరుప్రఖ్యాతులు

పొందా

సన్మానసత్కారాలు

అందుకున్నా


పూరింటిని

మరువలేకున్నా

ఙ్ఞాపకాలను

వీడలేకున్నా


పూరిల్లే

నాజన్మస్థానము

పేదవాళ్ళే

నాబంధుజనము


పల్లెలను

ప్రేమించుదాం

పేదలను

ప్రగతిలోకితెద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం




Comments

Popular posts from this blog