విమర్శకుడా!
రాయిని
విసరకు
తలను
పగులగొట్టకు
కర్రతో
కొట్టకు
ఓళ్ళును
హూణముచేయకు
ముళ్ళతో
గుచ్చకు
రక్తము
కార్చకు
నిప్పులు
చిమ్మకు
కాల్చి
బూడిదచేయకు
బాణాలు
సంధించకు
బాధలు
పెట్టకు
ఈటెను
వదలకు
గాయము
చేయకు
తప్పులుంటే
చూపు
సూచనలుంటే
చెయ్యి
పువ్వులు
చల్లు
సంతసము
కలిగించు
ప్రోత్సహము
ఇవ్వు
ప్రశంసలు
కురిపించు
అయినా విమర్శలకు
తావునివ్వనుగా
పాఠకులమదులను
దోచుకుంటాగా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment