ఆనందక్షణాలు


మెత్తగా తగిలితే

అదో ఆనందం

చల్లగా తాకితే

అదో ఆహ్లాదం


చక్కదనం కనబడితే

అదో సంతోషం

నగుమోము చూస్తుంటే

అదో సంతసం  


ప్రేమగా పిలిస్తే

అదో  పరితోషం

విజయం సాధిస్తే

అదో ప్రహ్లాదం


వెన్నెల కురుస్తుంటే

అదో ప్రమోదం

సుగంధం పీలుస్తుంటే

అదో ప్రతోషం


చక్కనితోడు దొరికితే

అదో కుతూహలం

మంచి అండదొరికితే

అదో కులాసం


పిల్లలు ప్రయోజకులైతే

అదో సౌఖ్యదాయకం

మంచి ఊహలుతడితే

అదో సుఖప్రదం


తీపిని తింటుంటే

అదో ఉల్లాసం

కడుపు నింపుకుంటే

అదో ఉత్సాహం


అనుకున్నది జరిగితే

అదో సంబరం

ఆప్తులు ప్రక్కనుంటే

అదో సంహర్షం


ఆలసత్వము

వహించకండి

లక్ష్యాలను

సాధించండి


ఆనందాలను

ఆస్వాదించండి

జీవితమును

అనుభవించండి


గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog