మాధవసేవ మానవసేవ
పెదవులతో
మాధవుని ప్రార్ధించు
తప్పులేదు
చేతులతో
చెయ్యి మానవసేవను
సంతోషపడతా
మందిరాలకు
దానాలు ఇవ్వు
దోషంకాదు
అనాధాశ్రమాలకు
ఆర్ధికసాయం అందించు
మెచ్చుకుంటా
దేవుళ్ళకు
పూజలు చేసుకో
అభ్యంతరంలేదు
పేదలను
ఆదరించి ఆదుకో
ఒప్పుకుంటా
గుడులకువెళ్ళు
తీర్ధప్రసాదాలు పంచు
అపరాధముకాదు
అన్నార్తులమొరలు
ఆలకించు తీర్చు
అభినందిస్తా
ఉపవాసలుండు
ఊరేగింపులు చెయ్యి
పొరపాటుకాదు
దరిద్రులకు
చేయూతనివ్వు చేరదీయి
సద్గుణిడివంటా
ప్రవచనాలు
చెప్పించు ఆధ్యాత్మికతనుపెంచు
నేరముకాదు
సమాజశ్రేయస్సుకు
పాటుపదు ఉద్ధరించు
మహాత్ముడివంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment