నమ్మటంలా!


ఎందుకో రాయాలనిపించింది

వ్రాస్తున్నా

ఏలనో చెప్పాలనిపించింది

చెబుతున్నా


ఆకాశానికి నిచ్చెనవేస్తున్నాననో

లేతసొరకాయలు కోస్తున్నాననో

అనుకుంటున్నారో ఏమో

నిజాలుచెబుతుంటే ఎదుటివాళ్ళు నమ్మటంలా


అమృతోత్సవాలలో పాల్గొనమని

కవితలను రాసిపంపమని

పురస్కారాలిస్తామని కేంద్రసాహీతసంస్థనుండి 

ఆహ్వానమువచ్చిందంటే నమ్మటంలా


ప్రధానమంత్రి కార్యాలయంనుండి

మనసులోమాట కార్యక్రమంలో

ఆకాశవాణి దూరదర్శనులలో 

ప్రధానితోపాటు మాట్లాడమన్నారంటే నమ్మటంలా


అమెరికాతెలుగువారు వీసాతీసుకోమని

ఖర్చులు భరిస్తామని

సాహిత్యసభల్లో ప్రసంగించమన్నారంటే

ఎవ్వరూ నమ్మటంలా


దేవుడు ఒకరోజురాత్రివచ్చాడని

చావుగురించి భయపడవద్దని

కోరుకున్నప్పుడు పిలవమని

స్వయంగావచ్చి తీసుకెళ్తానన్నాడంటే నమ్మటంలా


లక్ష్మీదేవి గజ్జెలుమ్రొగించి

గాజులు గళగళమనిపించి

వరంకోరుకోమంటే డబ్బుకొరతలేకుండా చూడమన్నానంటే

అందుకు అంగీకరించిందంటే నమ్మటంలా


సరస్వతీదేవి కళ్ళముందుకొచ్చి

వాక్కులిచ్చి వాగ్దానంచేసి

కలమును పట్టమన్నదంటే 

కవితలు కూర్చమన్నదంటే ఎవ్వరూ నమ్మటంలా


వివిధ సాహితీసంస్థలు

బిరుదులిస్తామని సన్మానాలుచేస్తామని

దరఖాస్తులు పెట్టుకోమన్నారంటే

నేను స్పందించటంలేదంటే నమ్మటంలా


పాఠకులు కైతలనుచదివి

పరవశము పొందుతున్నారంటే

ప్రశంసలు కురిపిస్తున్నారంటే

పొరుగునున్నవారు నమ్మటంలా


ఇది కవిత్వమనుకుంటే

మంచిది

లేదు కల్పితమనుకుంటే

మరీమంచిది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog