నా నిత్యపయనాలు
అక్షరాలతో
ప్రయాణం చేస్తున్నా
మచ్చికచేసుకుందామని
పదాలతో
ప్రయాణం చేసున్నా
వంటబట్టించుకుందామని
ఊహలతో
ప్రయాణం చేస్తున్నా
చక్కనివిషయాలు తడతాయని
కలంతో
ప్రయాణం చేస్తున్నా
కమ్మనిరాతలు కూర్చుదామని
పుటలతో
ప్రయాణం చేస్తున్నా
అద్భుతంగా నింపాలని
కవనంతో
ప్రయాణంచేస్తున్నా
కమ్మనికవితలు సృష్టించుదామని
మనసుతో
ప్రయాణం చేస్తున్నా
మంచిపేరుప్రఖ్యాతులు పొందాలని
దేహంతో
ప్రయాణం చేస్తున్నా
బొందికి గుర్తింపుతీసుకొనిరావాలని
జీవిత
ప్రయాణం కొనసాగిస్తున్నా
లక్ష్యాలని సాధించాలని
నిత్యప్రయాణుకుడికి
అండగా నిలుస్తారా
అందలం ఎక్కిస్తారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment