సరస్వతీపుత్రుడు
అతని
పెదవులు కదులుతుంటే
తేనెచుక్కలు చిందుతాయి
అతని
గళము తెరచుకుంటే
గాంధర్వగానము వినిపిస్తుంది
అతని
కలము కదులుతుంటే
కమ్మనికవితలు రూపుదిద్దుకుంటాయి
అతని
చూపులు తగులుతుంటే
చెప్పరాని ఆనందముకలుగుతుంది
అతని
నగుమోము చూస్తుంటే
మనసు ముచ్చటపడిపోతుంది
అతని
పేరు తలచుకుంటే
చక్కనికైతలు గుర్తుకొస్తాయి
అతను
మహాకవి విఙ్ఞానగని
చిరంజీవి సరస్వతీపుత్రుడు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment