నేను నా అమాయకత్వం
నోట్లో
వేలుపెట్టినా
కొరకటం
తెలియనివాడ్ని
తిట్టినా
తన్నినా
తలవంచుకొని
తిరిగేవాడ్ని
పొగిడినా
ప్రశ్నించినా
సమానంగా
చూచేవాడ్ని
బంతికి
చామంతికి
వ్యత్యాసం
ఎరగనివాడ్ని
ఇంటికి
ఇల్లాలికి
తేడాను
గ్రహించలేనివాడ్ని
పువ్వుకు
తావుకు
బంధము
భోధపడనివాడ్ని
అందానికి
ఆకర్షణకు
అనుబంధము
అర్ధంకానివాడ్ని
గులాబికి
ముళ్ళకు
సంబంధమెందుకో
కారణమెరుగనివాడ్ని
మల్లెకు
మత్తుకు
చుట్టరికము
తెలుసుకోలేనివాడ్ని
ప్రకృతికి
వికృతికి
ఆంతర్యం
అంతుబట్టనివాడ్ని
అఙ్ఞానిని
అల్పుడుని
అచేతుడుని
అమాయకుడుని
అనాముకుడిని
అప్రయోజకుడిని
అనాదరుడిని
అభాగ్యుడిని
అర్ధం
చేసుకుంటారా
హస్తం
అందించుతారా
వెన్ను
తడతారా
దన్ను
ఇస్తారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment