ఎమడిగానని?
కోకిలలా
గళమెత్తమనలా
నెమలిలా
నాట్యమాడమనలా
భోజనం
పెట్టమనలా
దాహం
తీర్చమనలా
చేతులు
కలపమనలా
కౌగిలి
ఇవ్వమనలా
ముచ్చట్లు
చెప్పమనలా
చప్పట్లు
కొట్టమనలా
అందాలు
చూపమనలా
చిందులు
త్రొక్కమనలా
కోపం
చూపించలా
దూరం
వెళ్ళిపొమ్మనలా
కేకలు
వెయ్యలా
నిప్పులు
చెరగలా
సొమ్ము
ఇమ్మనలా
సోకు
చూపమనలా
సిగ్గువిడిచి
అర్ధించా
చిన్నకోరికని
తీర్చమన్నా
చిరునవ్వును
అభ్యర్ధించా
చిన్నకోరికను
తీర్చమన్నా
బుగ్గలు
సొట్టబడితే చూద్దామని
మోము
వెలుగుతుంటే సంతసిద్దామని
ఆమాత్రానికే
గోలచెయ్యాలా
అందరిముందు
పరువుతియ్యాలా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment