ఓ మానవా!
గడ్డిపరకను
పాదాలతోత్రొక్కినా
కుయ్యిమనక
మౌనంగా ఉండేదాన్ని
పశువులు
మేసినప్పటికి
గాయపరచినప్పటికి
తిరిగి చిగురించేదాన్ని
పనికిరానిపువ్వువని
దూషించినప్పటికి
చిన్నిచిన్నిపూలు
పూసిచూడమనికోరేదాన్ని
నీరు
పోయకపోయినా
గొంతులెండినా
ప్రాణాలు నిలుపుకునేదాన్ని
మేతకోసం
కోసినాదోకినా
మరలామారాకుతొడిగి
పలకరించేదాన్ని
కోపం
ఎరుగనిదాన్ని
పగ
పట్టనిదాన్ని
మమ్మలనీ
సహజీవులుగా గుర్తించండి
మాకూ
ప్రాణమున్నదని తెలుసుకోండి
చేతులెత్తి
నమస్కరిస్తున్నా
చిట్టిదానినని
చిన్నచూపు చూడకండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment