ఏమిరాయనూ? ఏమిపాడనూ?
ఏ కవిత
నే రాయనూ
ఏ పాట
నే పాడనూ
ఏ విషయమూ
నే రాయనూ
ఏ రాగమందూ
నే పాడనూ ||ఏమి||
అందాలకవితనూ
రాయనా
ఆనండాలపాటనూ
పాడనా
పూలకవితనూ
నే రాయనా
పరిమళాలపాటను
నే పాడనా ||ఏమి||
బాలలకవితనూ
నే రాయనా
జోలపాటనూ
నే పాడనా
శ్రామికులకవితనూ
నే రాయనా
విప్లవగీతాన్ని
నే పాడనా ||ఏమి||
వెన్నెలకవితనూ
నే రాయనా
జాబిల్లిపాటనూ
నే పాడనా
ప్రేయసీకవితనూ
నే రాయనా
ప్రణయగీతమును
నే పాడనా ||ఏమి||
తల్లులకవితనూ
నే రాయనా
ఉయ్యాలపాటనూ
నే పాడనా
మనసుకవితనూ
నే రాయనా
మోహనగీతమును
నే పాడనా ||ఏమి||
యుక్తికవితనూ
నే రాయనా
భక్తిపాటనూ
నే పాడనా
చక్కనీకవితనూ
నే రాయనా
తియ్యనీపాటనూ
నే పాడనా ||ఏమి||
ప్రకృతీకవితనూ
నే రాయనా
ప్రభోదగీతమును
నే పాడనా
తెలుగువెలుగనీ
నే రాయనా
తెలుగుతల్లీపాటనూ
నే పాడనా ||ఏమి||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment