కవితా మాధుర్యాలు


ఊహలను

మాగబెడతా

కవిత్వాన్ని

పండించుతా


అక్షరాలను

పూయించుతా

పదాలను

మాలలుకడతా


వ్రాతలను

జవజవలాడిస్తా

కైతలని

కువకువలాడిస్తా


పలుకులలో

తేనెచుక్కలుచల్లుతా

పాటలలో

అమృతధారలుకురిపిస్తా


శబ్దాలను

సంధించుతా

స్వరాలను

సుమధురంచేస్తా


కయితలలో

జీవిస్తా

మనసులలో

నిలుస్తా


పాలలా

సాహిత్యాన్ని చిలుకుతా

వెన్నలా

కవనాలను బయటకుతీస్తా


తుపాకిలా

కలమును ప్రేల్చుతా

తూటాల్లా

కవితలను తలల్లోదించుతా


సాదాసీదా 

రాతలజోలికిపోనంటా

కల్లబొల్లి

కబుర్లనుచెప్పనంటా


తెలుగుసాహిత్యాన్ని

వెలిగిస్తా

తియ్యందనాలను

పంచేస్తా


కవితామాధుర్యాలను

అందిస్తా

సాహితీకాంక్షలను

తీరుస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog