బెజవాడ బాధలు


విజయవాడ పౌరుల

విషాదము చూశాను

విషయము తెలుసుకొని

విలపించి పోయాను


వాన కురిసింది

వాగులు పొంగించింది

వరద పారించింది

వీధుల జలమయముచేసింది


వార్తలు విని

కన్నీరు కార్చాను

నష్టాలు తెలుసుకొని

నివ్వెరా పోయాను


బుడమేరు పొంగింది

ఇళ్ళను ముంచింది

తినుటకు తిండిలేకుండచేసింది

త్రాగుటకు నీరులేకుండచేసింది


క్రిష్ణవేణి నిండుగాపారింది

గజగజలాడించింది

వారధి తెగుతుందేమోనని

భయభ్రాంతులకుగురిచేసింది


బెజవాడ బాధితులు

కట్టుబట్టలతో బయటపడ్డారు

ప్రాణాలు అరచేతపట్టుకొని

బిక్కుబిక్కుమంటూ గడిపారు


దాతలిచ్చిన నీటిపొట్లాలు

దిక్కయ్యాయి

ప్రభుత్వమిచ్చిన పులిహోరప్యాకెట్లు

ప్రాణాలుకాపాడాయి


పిల్లలు అలమంటించారు

వృద్ధులు వెతలపాలయ్యారు

రోగులు యాతనాచెందారు

మహిళలు కన్నీరుకార్చారు


నాయకులు

వచ్చారు ఓదార్చారు

ఇచ్చేది ఇచ్చారు

చెప్పేది చెప్పారు


క్రిష్ణమ్మ వారధిదాటింది

భయపెట్టింది 

బ్రతిమాలించుకుంది

శాంతించింది కాపాడింది


కనకదుర్గమ్మా వందనాలమ్మా

మరలా ఇలాజరగనీయకమ్మా

క్రిష్ణమ్మకు ముక్కుపుడకనీయమ్మా

ముప్పును మరోసారిరానీయకమ్మా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog