మనసిస్తారా!


కొద్దిసేపు

మనసిస్తే

కొన్నివిషయాలు

నూరిపోస్తా


మనసును

మేల్కొలుపుతా

నూతనాంశాలను

తెలియజేస్తా


మనసును

మొదట

ముడతా

ముద్రనువేస్తా


మనసును

తడతా

ఆలోచనాసరళిని

మారుస్తా


మనసును

మురిపిస్తా

అందచందాలు

చూపిస్తా


మనసును

ముచ్చటపరుస్తా

మహదానందంలో

ముంచేస్తా


మనసును

శుద్ధిచేస్తా

కల్మషాలను

కడిగేస్తా


మనసును

బుజ్జగిస్తా

అలకను

తీరుస్తా


మనసుకు

ముక్కుతాడువేస్తా

వ్యర్ధసంగతులజోలికి

వెళ్ళనీయకుంటా


మనసుకు

మర్యాదనేర్పుతా

మంచిదారిలో

నడిపిస్తా


మనసుకు

పాఠాలుచెబుతా

నిజాలను

తెలియపరుస్తా


మనసును

చదివిస్తా

మూఢత్వాన్ని

మానిపిస్తా


లేతమనసులకు

దారిచూపుతా

మంచిమనసులకు

అండనిస్తా


పెంకిమనసులకు

కళ్ళెమువేస్తా

చలాకిమనుసులకు

మార్గదర్శిగానిలుస్తా


మనసును

వెలిగిస్తా

లోకాన్ని

ఎరిగిస్తా


మనసులు

కలుపుతా

మిత్రుడిగా

నిలిచిపోతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog