మన తెలుగు (బాలగేయం)


తెలుగు బాలల్లారా

తెలుగు బాలికల్లారా

తెలుగు దీపములారా

తెలుగు వంశజులారా                     ||తెలుగు||


తెలుగు వ్రాద్దాం

తెలుగు చూద్దాం

తెలుగు వెలిగిద్దాం

తెలుగు చూపిద్దాం


తెలుగు చదువుదాం

తెలుగు పలుకుదాం

తెలుగు వినిపిద్దాం

తెలుగు వాడుదాం                        ||తెలుగు||


తెలుగు కోరుదాం

తెలుగు చాటుదాం

తెలుగు నేర్పుదాం

తెలుగు కూర్చుదాం


తెలుగు చిందుదాం

తెలుగు పంచుదాం

తెలుగు బాటపడదాం

తెలుగు పాటపాడుదాం                    ||తెలుగు||


తెలుగు నోర్లనుతెరుద్దాం

తెలుగు పెదాలువిప్పుదాం

తెలుగు చేతులుకలుపుదాం

తెలుగు మదులనుతట్టుదాం


తెలుగు నుడులుపలుకుదాం

తెలుగు గళాలనెత్తుదాం

తెలుగు రాజులతలుద్దాం

తెలుగు కవులస్మరిద్దాం                    ||తెలుగు||


తెలుగు మనతల్లిరా

తెలుగు మనజాతిరా

తెలుగు మనకీర్తిరా

తెలుగు మనదేవతరా


తెలుగు మననెలవురా

తెలుగు మనభాషరా

తెలుగు మనరక్తమురా

తెలుగు మనబంధమురా                   ||తెలుగు|| 


తెలుగు మనశ్వాసరా

తెలుగు మనధ్యాసరా

తెలుగు మనమాటరా

తెలుగు మనబాటరా


తెలుగు తీపిపంచరా

తెలుగు తేజముచిందరా

తెలుగు మిన్ననిచెప్పరా

తెలుగు సౌరభాలుచిమ్మరా                  ||తెలుగు||


గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog