ఓరి దేవుడా!
మ్రొక్కులను
తీర్చు భగవంతుడా
భూలోకమును
స్వర్గముచేయ్యి దేవుడా
మానవమృగాల
మనసులుమార్చు
జనారణ్యాలను
చేయిబృందావనాలు
మూగవాళ్ళతో
మాట్లాడించు
కుంటివాళ్ళతో
చకచకానడిపించు
గుడ్డివారికి
కంటిచూపునివ్వు
చెవిటివారికి
వినికిడిశక్తినివ్వు
కడుపులుమాడేప్రాణులకు
ఆహారమందించు
గొంతులెండినజీవులకు
మంచినీరునిప్పించు
చీకటిరాత్రులలో
వెన్నెలవెదజల్లు
వేసవికాలములో
వానకురిపించు
అందాలను
చూపించు
ఆనందాలను
కలిగించు
గాయపడ్డవారికి
ఉపశమనమివ్వు
రోగాలపాలైనవారికి
ఉచితచికిత్సలందించు
మోడుబారినచెట్లను
చిగురింపజేయి
ఎండిపోయిననదులను
ప్రవహింపజేయి
మహిళలను
కాపాడు
వృద్ధులను
రక్షించు
మహామంచికవులను
సృష్టించు
మనసులదోచేకవితలను
వ్రాయించు
అప్పుడు మొక్కులుతీర్చుకుంటా
గుడులకుమందిరాలకువెళ్తా
పూజాపునస్కారాలుచేస్తా
తీర్ధప్రసాదాలుపంచుతా
భాజాభజంత్రీలుమోగించుతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment