నదీతీరం కవితాతీరం
కవి
రోజూ నదీతీరానికి వస్తుంటాడు
ఏదో వ్రాసుకొని పోతుంటాడు
ఏవో తెలియపరచాలని చూస్తుంటాడు
నది
కవిని పిలుస్తుందో
కవి
నదిని కోరుకుంటాడో
నది
కవికి ఏమిస్తుందో
కవి
నదికి ఏమిస్తాడో
కవితని
నది రాయిస్తుందో
నదిని
కవి మురిపిస్తాడో
చినుకులు
చిటపటా పడుతాయి
నీళ్ళు
గలగలా ప్రవహిస్తాయి
అక్షరాలు
చకచకా పుటలకెక్కుతాయి
కవితలు
గబగబా పుట్టకొస్తాయి
కలం
పరుగెత్తుతుంది
కాలం
దౌడుతీస్తుంది
తీరం
కవితలని వ్రాయిస్తుంది
కవిత్వం
నదిలా పారుతుంది
తీరం
సంతసపడుతుందో
సంతోషం
తీరానికివస్తుందో
నది
కోరింది కమ్మనికవితలను
కవి
కలిపాడు నీటిలోరాతలను
మీరూ
కవితాతీరానికిరండి
కవితలనుచదవండి
కవనామృతమునుక్రోలుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment