ఒంటి కబుర్లు
ఓ తారవెలిసింది
గగనాన మెరిసింది
ఓ పువ్వుపూసింది
పరిమళం చల్లింది
ఓ నవ్వువిసిరింది
ముచ్చటా పరిచింది
ఓ చూపుచూచింది
కైపులో దింపింది
ఓ మబ్బులేచింది
చినుకులు కార్చింది
ఓ మొక్కమొలిచింది
మహావృక్షముగ ఎదిగింది
ఓ దీపంవెలిగింది
చీకటిని తరిమింది
ఓ తోడుదొరికింది
జీవితాన అండనిచ్చింది
ఓ అడుగుపడింది
గమ్యాన్ని చేర్చింది
ఓ అందంకనపడింది
ఆనందాన్ని ఇచ్చింది
ఓ ఊహపుట్టింది
జీవితాన్ని మార్చింది
ఓ కవిపుట్టాడు
కవితలు సృష్టించాడు
ఓ కైతచెంతకువచ్చింది
మనసును దోచింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment