ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వీక్షణం కాలిఫోర్నియా 146వ అంతర్జాల సాహితీ కార్యక్రమం
నేడు 19-10-2024వ తేదీ ఉదయం అంతర్జాలంలో జరిగిన వీక్షణం 146వ సాహితీ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు శ్రీమతి గీతా మాధవి గారు ముఖ్య అతిధి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని, ప్రత్యేక ఆహ్వానితులు ఆచార్య ఎం. రామనాధం నాయుడు గారిని, శ్రీ కొమరరాజు ఉమామహేశ్వరరావు గారిని, డాక్టర్ పండ్రంగి శారద గారిని మరియు కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వచ్చిన కవులకు స్వాగతం పలికారు. పిమ్మట తెలంగాణా స్పెషల్ డిప్యూటి కలెక్టరు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు అత్యాధునిక తెలుగు కవిత్వానికి నిర్వచనం చెప్పి, గురజాడ ముత్యాలసరాలు నుండి, విశ్వనాధ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలనుండి, శ్రీశ్రీ, కాళోజీ, సినారె మొదలగు కవుల కవితలను ఉదహరిస్తూ చక్కగా ప్రసంగించి సభికుల మన్ననలను పొందారు. వారి కవితలను అమెరికా యువకవి కమర గారు, సాలూరు కవి శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు, పర్లాకిమిడి కవి మరియు ఉత్కల సాహిత్య వేదిక అధ్యక్షురాలు శ్రీమతి పండ్రంగి శారద గారు, మరియు శ్రీమతి వేరుటి శైలజ గారు ముఖ్య అతిధి ప్రసంగాన్ని, ఇచ్చిన ఉదాహరణలను కొనియాడారు. కర్నాటక సారస్వతిక విశ్వవిద్యాలయం మైసూరు శాఖాధ్యక్షులు శ్రీ ఎం.రామనాధంనాయుదు గారు మరియు మా తెలుగుతల్లి అధ్యక్షులు శ్రీ కె.ఉమామహేశ్వరరావు గారు కర్నాటకలో తెలుగు అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. డాక్టర్ పండ్రంగి శారద గారు ఒరిస్సాలో ముఖ్యంగా పర్లాకిమిడిలో చేబడుతున్న తెలుగు సాహితీ కార్యక్రమాల గురించి వివరించారు.
తర్వాత గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు కవిసమ్మేళనం నిర్వహించారు.వీక్షణం అధ్యక్షురాలు గీతా మాధవి గారి కార్మికులారా వర్ధిల్లండి మొదలు చివర కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవుల కవితలు వరకు 22 మంది కవులు చక్కని కవితలను చదివి అందరిని ఆకట్టుకున్నారు. సభికులందరూ తమ సంతోషాన్ని వెల్లబుచ్చుతూ తదుపరి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటామన్నారు. చివరగా శ్రీమతి గీతా మాధవి గారు అందరికి ధన్యవాదాలు చెప్పి కార్యక్రమాన్ని ముగించారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment