ఓ చెలీ!
నువ్వేమో
అందానివి
నేనేమో
ఆస్వాదకుడను
నువ్వేమో
నవ్వువు
నేనేమో
పరిగ్రహుడను
నువ్వేమో
పువ్వువు
నేనేమో
తుమ్మెదను
నువ్వేమో
వెన్నెలవి
నేనేమో
విహారిని
నువ్వేమో
సౌరభానివి
నేనేమో
ఆఘ్రాణిని
నీవేమో
చైతన్యానివి
నేనేమో
జడత్వాన్ని
నీవేమో
ప్రోత్సాహానివి
నేనేమో
ప్రేరేపుతుడిని
నీవేమో
అమృతానివి
నేనేమో
క్రోలువాడిని
నువ్వేమో
సూదంటురాయివి
నేనేమో
ఇనుపకడ్డీని
నువ్వేమో
గాలానివి
నేనేమో
చేపను
నీవేమో
కవితాకన్యవు
నేనేమో
కలంపట్టినకవిని
ఆలశ్యం
అనర్ధకం
సమయం
అమూల్యం
ప్రణయాన్ని
ఫలవంతంచేద్దాం
జీవితాన్ని
అనుభవించుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment