ఓ వెన్నెలా!
ఓ వెన్నెలా
ఎవరివో నీవెవరివో
అందరిని అలరిస్తున్నావు
ఆనందాన్ని అందిస్తున్నావు
ఏ అంగన అందానివో
వెన్నెలా
ఏ అతివ ఆనందానివో
వెన్నెలా
ఏ చిగురుబోడి చిరునవ్వువో
వెన్నెలా
ఏ చిన్నదాని సిగపువ్వువో
వెన్నెలా
ఏ పూబోడి పులకరింపువో
వెన్నెలా
ఏ పడతి ఆరబోసినపిండివో
వెన్నెలా
ఏ లేమ లేపానివో
వెన్నెలా
ఏ లలన లాలిత్యానివో
వెన్నెలా
ఏ వనిత వర్ణానివో
వెన్నెలా
ఏ వనజాక్షి వెలుగువో
వెన్నెలా
ఏ కన్నియ కళకళవో
వెన్నెలా
ఏ కాంత కాంతివో
వెన్నెలా
ఏ కలికి కులుకువో
వెన్నెలా
ఏ కోమలి జిలుగువో
వెన్నెలా
ఏ మహిళ మిడిసిపాటువో
వెన్నెలా
ఏ మానిని మెరుపువో
వెన్నెలా
ఏ పైదలి ప్రోత్సాహానివో
వెన్నెలా
ఏ ప్రమిద ప్రాయానివో
వెన్నెలా
ఏ నెలత ఆకర్షణవో
వెన్నెలా
ఏ నాతుక జిగేలివో
వెన్నెలా
ఏ పూదోటలో పచార్లుచేయను
వెన్నెలా
ఏ కలువలచెరువుప్రక్కన విహరించను
వెన్నెలా
నీవు నచ్చనివారులేరు
వెన్నెలా
నిన్ను మెచ్చనివారులేరు
వెన్నెలా
ఎవరితోడును తెచ్చుకుందును
వెన్నెలా
ఎంతసమయము వెచ్చించను
వెన్నెలా
ప్రణయానికి ప్రతీకవయ్యావు
వెన్నెలా
మనసులను దోచేస్తున్నావు
వెన్నెలా
జోష్ ఇచ్చావు
వెన్నెలా
జోహారు జోహారు
వెన్నెలా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment