మాటలు


మనమాటలు

అప్పుడప్పుడు

చందనపుష్పాలా

సుగంధాలుచల్లుతుంటాయి

మల్లియల్లా

మనసులుదోస్తుంటాయి

గులాబీల్లా

గుబాళిస్తుంటాయి

మందారాల్లా

మకరందాన్నందిస్తాయి 

తియ్యంగా

తేనెచుక్కలుచల్లుతుంటాయి

దీపాల్లా

వెలుగులుచిమ్ముతుంటాయి

సీతాకోకచిలుకల్లా

చక్కదనాలుచూపుతుంటాయి

జాబిలిలా

చల్లనివెన్నెలవెదజల్లుతుంటాయి

కోకిలలా

కమ్మనిస్వరాలువినిపిస్తుంటాయి

మంత్రాల్లా

ముగ్ధులనుచేస్తుంటాయి


మీ గళంనుండి

గాంధర్వగానం వెలువడాలనుకుంటున్నాను

మీ కలంనుండి

మధురమామిడిసారం పారాలనుకుంటున్నాను

మీ పెదవులనుండి

సుధారసం చిమ్మాలనుకుంటున్నాను

మీ హృదయంనుండి

ప్రేమాభిమానాలు పొంగాలనుకుంటున్నాను


నేను

మాటల ప్రేముకుడిని

పదాల ప్రయోగికుడిని

అందాలు వర్ణించేవాడిని

ఆనందాలు అందించేవాడిని


నోరూరిస్తే క్షమించండి

ఆశలులేపితే సాధించండి

రంగంలోకిదింపితే తలచుకోండి

విజయంసాధిస్తే పొంగిపోండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog