పుష్పకన్య
ఎంత మృదువుగా ఉన్నావో అన్నా
సిగ్గుపడింది
తాకకూడదనుకున్నా
నలపకూడదనుకున్నా
ఎంత చక్కగా ఉన్నావో అన్నా
వెలిగిపోయింది
కళ్ళను తిప్పకూడదనుకున్నా
మోమును మరల్చకూడదనుకున్నా
ఎంత ప్రకాశంగా ఉన్నావో అన్నా
ధగధగలాడింది
కాంతిని గ్రహించా
రూపాన్ని తిలకించా
ఎంత పరిమళం వీస్తున్నావో అన్నా
అత్తరుచల్లింది
అదేపనిగా ఆఘ్రానించా
ఆనందంలో మునిగిపోయా
ఎంత కళాత్మకంగా ఉన్నావో అన్నా
కళకళలాడింది
చూడకుండా నిలువలేకున్నా
మెచ్చకుండా మౌనందాల్చలేకున్నా
ఇంకెంతసేపని ఇంటికిబయలుదేరా
తల్లడిల్లింది
గిలగిలలాడింది
కన్నీరుకార్చింది
సైగలుచేసి
చెంతకురమ్మంది
చేతిలోకితీసుకోమంది
స్పర్శించితరింపజేయమంది
పట్టుకుంటే
పరవశించింది
కిలకిలానవ్వింది
మత్తులోదించింది
పుష్పకన్యను వీడను
ఇంటికి తెచ్చుకుంటా
తోడుగా ఉంచుకుంటా
ప్రక్కనే పెట్టుకుంటా
అహా! ఏమిభాగ్యము? అదృష్టదేవత
అవకాశమిచ్చింది
అందాలుచూపింది
ఆనందపరిచింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment