ఓ కవితాకన్యకా!


మల్లికలారావా 

మైమరిపించవా

పరిమళంచల్లవా

పరవశపరచవా


మాధురిలారావా

మాధుర్యమునందించవా

ముచ్చట్లుచెప్పవా

మదినిమురిపించవా


సుహాసినిలారావా

చిరునవ్వులుచిందవా

మోమునువెలిగించవా

బాధలుమరిపించవా


సుమతిలారావా

చక్కనిభావాలులేపవా

కమ్మనికైతలురాయించవా

కవనలోకాననిలుపవా


సువర్ణలారావా

ధగధ్గలాడరాదా

కళ్ళనుతెరిపించరాదా

కవనాలు కూర్పించరాదా


సరోజలారావా

చక్కదనాలు చూపవా

సన్మోహితుడినిచేయవా

సంతసపరచవా


కమలలారావా

కమ్మదనాలు కనిపింపజేయవా

కాంతికిరణాలు ప్రసరింపజేయవా

కుతూహలపరచవా


పుష్పికలారావా

విప్పారి వేడుకచేయవా

అందాలు చూపించవా

ఆనందమునివ్వవా


రోజాలారావా

గుండెనుతాకరాదా

గుబాళించరాదా

గుబులునుతీర్చరాదా


కుసుమలారావా

ఖుషీచేయరాదా

కలమునుపట్టించరాదా

కవితలనువ్రాయించరాదా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం 


Comments

Popular posts from this blog