జన్మసాఫల్యం
మనుషజన్మ
మహోన్నతమైనదోయ్
పూర్వజన్మ
సుకృతాలఫలమోయ్
బతుకును
ఉద్ధరించుకోవాలోయ్
జన్మను
సాఫల్యంచేసుకోవాలోయ్
మాతృమూర్తి
ఋణముతీర్చుకోవాలోయ్
మాతృభూమికి
ఖ్యాతినితేవాలోయ్
మాతృభాషను
వ్యాప్తిచేయాలోయ్
గురువులను
గౌరవించాలోయ్
తండ్రికి
సేవలుచేయాలోయ్
తోటివారికి
సహాయపడాలోయ్
హింసామార్గాన్ని
వీడాలోయ్
అవినీతిబాటని
అరికట్టాలోయ్
లక్ష్యాలను
సాధించాలోయ్
జీవితమును
సుసంపన్నంచేసుకోవాలోయ్
అన్నదమ్ములను
ప్రేమించాలోయ్
అక్కాచెల్లెల్లను
ఆదుకోవాలోయ్
ద్రోహులను
శిక్షించాలోయ్
మోసగాళ్ళకు
గుణపాఠంచెప్పాలోయ్
అనాధులకు
అండగానిలవాలోయ్
అన్నార్తులకు
ఆహారమందించాలోయ్
సమాజశ్రేయస్సుకు
పాటుపడాలోయ్
దేశాభివృద్ధికి
పాటుపడాలోయ్
స్వార్ధము
తగ్గించుకోవాలోయ్
పరహితముకు
పాటుపడాలోయ్
దానవత్వం
విడవాలోయ్
మానవత్వం
చాటాలోయ్
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment