ఏమనుకున్నావు?


ఏమనుకున్నావు

నన్నేమనుకున్నావు

ఎందుకు భయపడుతున్నావు

ఎందుకు పారిపోతున్నావు


కందిరీగననుకున్నావా

కుటతాననుకున్నావా

తేనెటీగననుకున్నావా

ముళ్ళుగుచ్చుతాననుకున్నావా


గుడ్లగూబననుకున్నావా

కూతకూస్తాననుకున్నావా

గబ్బిలాన్ననుకున్నవా

చెవులోదూరతాననుకున్నావా


కుక్కననుకున్నావా

మొరుగుతాననుకున్నావా

నక్కననుకున్నావా

ఊళవేస్తాననుకున్నావా


గాడిదననుకున్నావా

తంతాననుకున్నావా

గుఱ్ఱాన్ననుకున్నావా

క్రిందపడవేస్తాననుకున్నావా


పాముననుకున్నావా

విషమెక్కిస్తావనుకున్నవా

తేలుననుకున్నావా

కాటువేస్తాననుకున్నావా


ఎద్దుననుకున్నావా

కుమ్ముతాననుకున్నావా

దున్నననుకున్నావా

పొడుస్తాననుకున్నావా


బాణాన్ననుకున్నావా

గాయపరుస్తాననుకున్నావా

తుపాకిననుకున్నావా

తూటాలుప్రేలుస్తాననుకున్నావా


ముళ్ళననుకున్నావా

మేనులోకిదిగుతాననుకున్నావా

కత్తిననుకున్నావా

కాయాన్నికోస్తాననుకున్నావా


దోమననుకున్నావా

రోగమెక్కిస్తాననుకున్నావా

ఈగననుకున్నావా

అంటువ్యాధులుతగిలిస్తాననుకున్నావా


ఉద్యమకారుడనుకున్నావా

కానేకాను

విమర్శకుడనుకున్నావా

అసలేకాను


నేనో

అక్షరపిపాసిని

పదాలప్రయోగిని

కవితలసృష్టికర్తని


నేనో

తెలుగాభిమానిని

పూలప్రేముకుడిని

భావకవిని


మనసులను

దోసేస్తా

మన్ననలను

పొందేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.భాగ్యనగరం


Comments

Popular posts from this blog