నాకోసం
నాకోసం
ఎందరో ఎదురుచూస్తున్నారు
ఏలనో కాచుకొనియున్నారు
ఎందుకో వెదుకులాడుచున్నారు
నన్ను చూడాలని
కొందరు యత్నిస్తున్నారు
నన్ను చదవాలని
కొందరు కోరుకుంటున్నారు
నన్ను అర్ధంచేసుకోవాలని
కొందరు ప్రయాసపడుతున్నారు
నన్ను తలకెక్కించుకోవాలని
కొందరు తంటాలుపడుతున్నారు
నన్ను అనుసరించాలని
కొందరు అనుకుంటున్నారు
నన్ను అనువదించాలని
కొందరు తలపోస్తున్నారు
నన్ను పాడాలని
కొందరు కోరుకుంటున్నారు
నన్ను వినాలని
కొందరు తపిస్తున్నారు
నన్ను వ్రాయాలని
కొందరు పాటుపడుతున్నారు
నన్ను సవరించాలని
కొందరు సూచిస్తున్నారు
నన్ను అందంగాదిద్దాలని
కొందరు భావిస్తున్నారు
నన్ను అమరంచెయ్యాలని
కొందరు శ్రమిస్తున్నారు
నా రూపం
అక్షరం
నా ఆంతర్యం
భావం
నేను
హృదయాలను తాకుతాను
గుండెలను మీటుతాను
మదులను ముడతాను
నాకోసం కొందరు
ఆలోచిస్తున్నారు
శ్రమించుతున్నారు
ప్రార్ధించుతున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment