కాలగమనం కవితలజననం
కాలచక్రం
పరుగెడుతుంది
జీవనకాలం
తరిగిపోతుంది
కాలం
కరిగిపోతుంది
ఙ్ఞాపకం
మిగిలిపోతుంది
గతం
తిరిగిరాకున్నది
వర్తమానం
ఆగిపోకున్నది
ఆరాటం
ఆగకున్నది
పోరాటం
తప్పకున్నది
జగన్నాటకం
చూడమంటుంది
జీవితగమనం
సాగించమంటుంది
కవనోత్సాహం
తగ్గిపోకున్నది
కైతారచనాంగం
కొనసాగించమంటుంది
మరణం
వెంటపడుతున్నది
కవనం
విడిచిపెట్టకున్నది
మెప్పులు
పొందమంటుంది
మదులను
దోచమంటుంది
నాలుకల్లో
నానమంటుంది
తలల్లో
నిలిచిపొమ్మంటుంది
కవితలవానను
కురిపించమంటుంది
కవననదులను
పారించమంటుంది
కయితాపుష్పాలు
పూయించమంటుంది
సాహిత్యసౌరభాలు
వెదజల్లమంటుంది
సూర్యోదయం
రోజూ జరుగుతుంది
కవితోదయం
నిత్యమూ అవుతుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment