కవితాజిలేబీలు
జిలేబీలనువండుతా
ఘుమఘుమలాడిస్తా
కవితలనువ్రాస్తా
జివజివలాడిస్తా
జిలేబిచూపుతా
నోరూరిస్తా
కైతను కనమంటా
ఆశనులేపుతా
జిలేబినందిస్తా
ఆనందపరుస్తా
కయితనుచేతికిస్తా
మురిసిపొమ్మంటా
జిలేబీనితినమంటా
చప్పరించమంటా
కవనాన్నిచదవమంటా
మధురానుభూతినిపొందమంటా
జిలేబీని తలపించేలాజేస్తా
మరలా తినాలనిపించేలాచేస్తా
కవిత్వాన్ని గుర్తుపెట్టుకొనేలాచేస్తా
పదేపదే పఠించేలాచేస్తా
జిలేబీలు మహారుచి
కవనాలు అంతేరుచి
జిలేబీలు భలేతీపి
కవితలు అంతేతీపి
తినటం మరిగారా
ఇకవదలనే వదలరు
చదవటం అలవాటుపడ్డారా
జీవితంలోనే మరచిపోరు
ఆలశ్యం ఎందుకు
రంగంలోకి దిగండి
జిలేబీలు తినండి
కవితలను చదవండి
చక్కెర వ్యాధున్నా
పరవాలేదు అడ్డంకికాదు
పూర్తిగా అర్ధంకాకున్నా
పక్కవారినడగొచ్చు తెలుసుకోవచ్చు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment