మన ఏ ఎస్ రావు
మహానుభావుడు
నిరాడంబరుడు
ఈ సి ఐ ఎల్ స్థాపకుడు
ఏ ఎస్ రావు నామధేయుడు ||మహా||
దేశాన్ని ప్రేమించాడు
ధైర్యాన్ని చూపించాడు
విశ్వాసంతో పనిజేశాడు
లక్ష్యాలను సాధించాడు ||మహా||
వ్యూహాత్మకుడు
దూరదృష్టికలవాడు
పట్టుదలకలవాడు
జాతికంకితమైనవాడు ||మహా||
నైపుణ్యం చూపాడు
పెక్కురికి శిక్షణనిచ్చాడు
పలు ఉత్పత్తులనుచేయించాడు
బహుమేలు దేశానికిచేశాడు ||మహా||
సాంకేతికరంగ మాగదర్శకుడు
డిగిటల్ కంప్యూటర్ మొదటచేయించాడు
సాలిడ్ స్టేట్ టీవి ప్రవేశపెట్టాడు
ఎర్త్ స్టేషన్ యాంటీనాకు ఆద్యుడు ||మహా||
ఈ సి ఐ ఎల్ కు పేరు తెచ్చాడు
వేల ఉద్యోగాలను సృష్టించాడు
విదేశదిగుమతులు తగ్గించాడు
ఆర్ధికవ్యవస్థను సుస్థిరపరిచాడు ||మహా||
విదేశమోజు లేనివాడు
సంపాదనధ్యాస లేనివాడు
భారతమాత ముద్దుబిడ్డడు
జాతికి గర్వకారకుడు ||మహా||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
(అక్టోబర్ 31 వ తేది డాక్టర్ ఏ యస్ రావు వర్ధంతి సందర్భంగా వ్రాసిన గేయం)
Comments
Post a Comment