కవిత! ఓ కవిత! నేటి కవిత!
పొద్దున్నే
పొద్దుపొద్దునే
కలమునుపట్టి
కాగితమునుతీసి
వ్రాయాలనుకున్నవెంటనే
గలగలమనిగాజులాడిస్తూ
ఘల్లుఘల్లుమనిగజ్జలుమ్రోగిస్తూ
ఆలోచనలనుపారిస్తూ
అక్షరాలనుకూరుస్తూ
అర్ధాలనొనగూరుస్తూ
పదాలనుపారిస్తూ
పంక్తులనుపేరుస్తూ
అంతరంగాన్నితడుతూ
ప్రాసలనుకూర్చుతూ
పోలికలనుచేరుస్తూ
గలగలమనిప్రవహిస్తూ
కవితాకన్యకవచ్చింది
కమ్మనికైతనువ్రాయించింది
పాఠకులకుపంపించింది
పరవశమునుపంచింది
మనసులనుముట్టింది
తలలోతిష్ఠవేసింది
ఉల్లంబుననిలిచి
ఉజృంభించుతూ
ఉక్తులనందిస్తూ
మంచిగచెబుతూ
ఘనఘనపలికిస్తూ
గలగలాపారించుతూ
ప్రీతినికలిగిస్తూ
వ్రాయించుతున్న
సరస్వతీతల్లికి
రెండుచేతులెత్తి
నమస్కరించి
చెపుదునునిత్యము
వేలవందనములు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment