ఆకవిగారి కవనాలు


అతనివి

కుక్కపిల్లలు సబ్బుబిళ్ళలు కావు

అతనివి

సుమసౌరభాలు తెలుగువైభవాలు


అతనివి

కఠినపదాలు కాఠిన్యరాతలు కావు

అతనివి

తేటపలుకులు తెలుగుతియ్యందనాలు


అతనివి

కల్లబొల్లికబుర్లు కలలదొంతరలు కావు

అతనివి

అక్షరసత్యాలు ప్రాసపదాలప్రయోగాలు


అతనివి

దురాలోచనలు దుష్టబుద్ధులు కావు

అతనివి

కమ్మనితలపులు రసరమ్యవీచికలు


అతనివి

అంధకారాలు అయోమయాలు కావు

అతనివి

రవికిరణాలు శశివెలుగులజల్లులు


అతనివి

అశ్లీలాలు అమంగళాలు కావు

అతనివి

అద్భుతాలు అద్వితీయాలు


అతనివి

అర్ధరహితాలు వ్యర్ధవచనాలు కావు

అతనివి

ప్రకృతిసొగసులు మానసికోల్లాసాలు


అతనివి

సూక్ష్మముకాదు చేంతాడుకాదు

అతనివి

చిట్టిచిట్టిపదాలు చిన్నిచిన్నిపంక్తులు


అతనివి

గాడిదగాండ్రింపులు నక్కలరుపులు కావు

అతనివి

కోకిలకుహూకుహులు గాంధర్వగానాలు


అతనిని

విమర్శిస్తే విలువతగ్గిస్తే ఊరుకోను

అతనిని

పొగిడితే ప్రోత్సహిస్తే పరవశిస్తాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog