నైమిశంలో అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక వారి కార్తీక వనభోజనాల వేడుక


నిన్న 15-11-2024వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భముగా జిడ్డు క్రిష్ణమూర్తి కేంద్రం నైమిశంలో కాప్రా మల్కాజగిరి కవుల వేదిక కార్తీక వనభోజనాల వేడుకను అద్భుతంగా నిర్వహించింది. మొదట కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అందరికి స్వాగతం పలికారు. వేదిక మార్గదర్శకుడు మరియు సినీటీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవుల వేదిక గురించి వివరించి అతిధులకు మరియు ఆహ్వానితులు బాగా స్పందించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత మనస్తత్వవేత్త శ్రీ శ్రీక్రిష్ణ గారు మనిషి తనకు తనే మిత్రుడని, తనకు తనే శత్రువని చెబుతూ మనోవికాసానికి తీసుకొనవలసిన పద్ధతులను చక్కగా వివరించారు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు తను వివిధ సంస్థలకు ఇచ్చిన మరియు ప్రఖ్యాతి పొందిన వ్యాపార ప్రచార ప్రకటనల గురించి వివరించారు. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధా కుసుమ గారు అంత్యాక్షరి పాటల కార్యక్రమాన్ని చాలా ఉత్సాహభరితంగా నిర్వహించారు.  తెలుగువెలుగు ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరి నారాయణరావు గారు తంబోలా ఆట కార్యక్రమాన్ని వినోదభరితంగా నిర్వహించారు.ప్రముఖ పద్యకవి డాక్టర్ రాధశ్రీ గారు ఆశు పద్యాలు పాడి అందరిని అలరించారు.సినీగేయ రచయిత కవి శ్రీ సాదనాల వేంకటస్వామినాయుడు గారు కవి సమ్మేళనమును చక్కగా నిర్వహించారు. విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు కవులను అతిధులను ఉత్తరీయాలతో కప్పి సత్కరించారు.శ్రీ వసీరా, శ్రీ గొడుగు యాదగిరిరావు, శ్రీమతి శోభ దేశ్ పాండె, శ్రీమతి కొలచన శ్రీసుధ, శ్రీమతి పద్మావతి, శ్రీ వీరరాఘవులు, శ్రీ జె వి కుమార్, డాక్టర్ అర్వ రవీంద్రబాబు మొదలగు 25 మంది కవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం  40 మంది పాల్గొని కార్యక్రమాని విజయవంతంచేశారు మరియు ఆసాంతం ఆస్వాందించారు. ఈ వేదిక ద్వారా భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించాలని అందరు తమ అభిమతాన్ని వ్యక్తపరిచారు..


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog