ఓ కెశివారెడ్డి కవివరేణ్యా!


సాహితీ జగతిలో

సవ్వడీ చేసేవు

సరస్వతీ దేవినీ

సన్నుతీ చేసేవు             ||సాహితీ||


అక్షరాలను పేర్చి

ఆటలూ ఆడించేవు

పదాలను కూర్చి

పాటలూ పాడించేవు


మదులనూ తట్టేవు

హృదులలో నిలిచేవు

భావాలు చెప్పేవు

భ్రమల్లో ముంచేవు           ||సాహితీ||


కలమును పట్టేవు

పుటలను నింపేవు

కైతలను కూర్చేవు

కమ్మదనమునిచ్చేవు


వైవిద్య విషయాలు

వివరంగ చెప్పేవు

నూతన ఒరవడులు

నిత్యమూ చూపేవు           ||సాహితీ||


కవన సేద్యమూ

కొనసాగించేవు

కవితల పంటలూ

కుమ్మరించేవు


రవివోలె కాంతులు

ప్రసరణాచేసేవు

శశివోలె వెన్నెలను

పుడమిపైచల్లేవు              ||సాహితీ||           


కయితా సుమాలను

పూయించేవు

కవన సౌరభాలను

వెదజల్లేవు


అమృతాజల్లులును

కురిపించేవు

అధరాలకు

తేనెచుక్కలనందించేవు          ||సాహితీ||


గాంధర్వగానమును

వినిపించేవు

కర్ణాలకింపుసొంపులను

కలిగించేవు


తెలుగుతల్లికీ

వందనాలు చేసేవు

తెలుగుజాతికీ

పేరుప్రఖ్యాతులు తెచ్చేవు        ||సాహితీ||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


(కళా మిత్రమండలి ఒంగోలు వారు రేపు 24-11-2024వ తేదీ గౌరవనీయులు, ప్రముఖ కవి మరియు సాహితీ వేత్త శ్రీ కె. శివారెడ్డి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించే సందర్భముగా నేను వ్రాసిన పాట)


Comments

Popular posts from this blog