ఎందుకో ఈరోజు?
ఆవేశము
వస్తుంది
ఆవేదన
పెడుతుంది
మదిని
తెరవమంటుంది
పుటలపై
పెట్టమంటుంది
అందాలు
చూపమంటుంది
ఆనందాలు
పంచమంటుంది
పువ్వులు
చల్లమంటుంది
పరిమళాలు
వెదజల్లమంటుంది
వాన
కురిపించమంటుంది
నీరు
పారించమంటుంది
ఆటలు
ఆడించమంటుంది
పాటలు
పాడించమంటుంది
వెలుగులు
చిమ్మమంటుంది
చీకట్లను
తరుమమంటుంది
ఆలోచనలు
పారించాలనిపిస్తుంది
భావాలు
పుట్టించాలనిపిస్తుంది
అక్షరాలు
అల్లాలనిపిస్తుంది
పదాలు
పొసగాలనిపిస్తుంది
కలము
కదిలించాలనిపిస్తుంది
కాగితము
నింపాలనిపిస్తుంది
మనసు
ముందుకుతోస్తుంది
ఉల్లము
ఉద్రేకపడుతుంది
కవితలు
జనిస్తున్నాయి
కమ్మదనాలు
కలిగిస్తున్నాయి
పాఠకులను
పరవశపరచాలనియున్నది
విమర్శకులు
విస్మయపరచాలనియున్నది
సాహిత్యలోకాన్ని
సంబరపరచాలనియున్నది
శారదాదేవిని
సంతృప్తిపరచాలనియున్నది
కైత
కూడింది
కోర్కె
తీరింది
తక్షణము
చదవండి
అభిప్రాయము
చెప్పండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment