నా మనసు


మనసు

నిండా మునిగింది

అక్షరాల వర్షంలో

పదాల ప్రవాహంలో


మనసు

ఆలోచనల్లో తేలుతుంది

ఆకాశంలో మేఘాల్లా

కాలవలలో పడవల్లా


మనసు

మంటల్లో కాలుతుంది

పొయ్యిలో కట్టెల్లా

కారుచిచ్చులో చెట్లలా


మనసు

పరుగులు తీస్తుంది

చిరుతవెంటబడిన జింకలా

శిఖరంనుండిజారే సెలయేరులా


మనసు

అన్వేషణ చేస్తుంది

ఆకలయిన పులిలా

గొంతెండిన పక్షిలా


మనసు

కాచుకొని యున్నది

కలమును చేపట్టాలని

కాగితము నింపేయాలని


మనసు

పగటికలలు కంటుంది

మంచికవితలు రాయాలని

పాఠకులమదులు తట్టాలని


మనసు

ఉవ్విళ్ళు ఊరుతుంది

రవిలా జగతిలోవెలగాలని

కవిలా కలకాలంనిలవాలని


మనసు

భ్రాంతిలో పడింది

భావకైతలు కూర్చాలని

భ్రమల్లో ముంచాలని 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog