ఓ కవిరాజా!
ముందునడువు
సమాజాన్ని ముందుకునడిపించు
అడ్డదారులు తొక్కొద్దను
అవాంతరాలు కలిపించొద్దను
గమ్యమువైపు నడవమను
లక్ష్యాలను సాధించమను
చెప్పు
మంచిమాటలు చెప్పు
నిజాలు చెప్పు
నీతిగ బ్రతకమను
వైషమ్యాలు పెంచొద్దను
విషబీజాలు నాటొద్దను
చెయ్యి
పరోపకారాలు చెయ్యి
ప్రేమాభిమానాలు చాటు
మానవత్వము తెలుపు
సక్రమమార్గము చూపు
సమాజహితము కోరు
పెంచు
చెట్లనుపెంచమను పరిసరాలనుకాపాడమను
పచ్చదనము పరికించమను
ప్రకృతిని ప్రేమించమను
పువ్వులుపూయించు పొంకాలుచూపించు
పరిమళాలువీయించు పరవశాలనందించు
చూపు
అందాలు చూపు
ఆనందాలు పంచు
కాంతులు ప్రసరించు
మోములు వెలిగించు
నవ్వులు చిందించు
సాధించు
విజయాన్ని సాధించు
దేశాన్ని ప్రేమించు
జాతిని మేలుకొలుపు
పేరుప్రఖ్యాతులు పొందు
చరిత్రను సృష్టించు
వ్రాయి
చక్కగా వ్రాయి
అందరిని చదివించు
అంతరంగాలను తట్టు
శాశ్వతముద్రను వెయ్యి
చిరంజీవిగ నిలువు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment