ఇల్లు ఇల్లాలు
ఇల్లు
వెలిగిపోతుందంటే
ఇల్లాలు
ఇంటిలో దీపంగా ఉన్నట్లే
ఇల్లు
ఆనందంగా ఉందంటే
ఇల్లాలు
ఇంటిలో ప్రేమానురాగాలు పంచుతున్నట్లే
ఇల్లు
సిరులతో తూగుతుందంటే
ఇల్లాలు
ఇంటిలో లక్ష్మీదేవిగా అవతరించినట్లే
ఇల్లు
ఒకతాటిమీద నడుస్తుంటే
ఇల్లాలు
గణనీయమైనపాత్రను పోషిస్తున్నట్లే
ఇల్లు
సమాజంలో గౌరవమర్యాదలు పొందుతుంటే
ఇల్లాలు
బరువుబాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లే
ఇల్లు
పలుశుభకార్యాలకు ఆలవాలమైతే
ఇల్లాలు
తన సమర్ధతను చాటుకున్నట్లే
ఇల్లు
స్వర్గసీమను తలపిస్తుంటే
ఇల్లాలు
దేవతాపాత్రను పోషిస్తున్నట్లే
ఇల్లు
బంధువులకు నెలవైతే
ఇల్లాలు
చక్కని అనుబంధాలను సాగిస్తున్నట్లే
ఇల్లు
చక్కని నిర్ణయాలకు తావయితే
ఇల్లాలు
మంచి సలహాలను ఇస్తున్నట్లే
ఇల్లు
పూజాపునస్కారాలకు స్థావరమయితే
ఇల్లాలు
దేవునికృపకు పాత్రురాలయినట్లే
ఇల్లు
ఆలయమయితే
ఇల్లాలు
అందులోదేవతే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment