తెలుగుతల్లికి ప్రణామాలు
తీయతీయని మాటలతో
తేనెచుక్కలు చిందుతూ
మనతెలుగుతల్లినీ
స్తుతించెదమా ||తీయ||
తేటతేటైన పలుకులతో
నిర్మలమైన హృదయంతో
మనతెలుగుతల్లినీ
ప్రార్ధించెదమా
అమృతమొలికే
అక్షరాలతో
మనతెలుగుతల్లినీ
ఘటియించెదమా ||తీయ||
ధగధగలాడే
తళుకులతో
మనతెలుగుతల్లినీ
వెలిగించెదమా
ఘుమఘుమలాడే
మల్లెమాలలతో
మనతెలుగుతల్లినీ
అలంకరించెదమా ||తీయ||
గళమునెత్తి గట్టిగా
ఘనకీర్తిని చాటుతూ
మనతెలుగుతల్లినీ
కొనియాడెదమా
చెయ్యెత్తి నినదిస్తూ
దశదిశల వినిపిస్తూ
మనతెలుగుతల్లికీ
జైకొట్టెదమా ||తీయ||
రెండుచేతులు జోడిస్తూ
భక్తివినయాలతో పూజిస్తూ
మనతెలుగుతల్లికీ
నమస్కరించెదమా
కర్పూరమును వెలిగిస్తూ
గుప్పుగుప్పుమని మండిస్తూ
మనతెలుగుతల్లికీ
హారతినిచ్చెదమా ||తీయ||
కన్నతల్లికీ
సమానముగా
మనతెలుగుతల్లికీ
ప్రణమిల్లెదమా
అన్ని దేశాలందునా
అతిలెస్సయిన భాషనీ
మనతెలుగుతల్లినీ
కీర్తించెదమా ||తీయ||
ఎన్ని భాషలున్నా
ఏదేశానికి వెళ్ళినా
మనతెలుతల్లినే
ప్రశంసించెదమా
ఏ నేలయినా
ఏ వృత్తయినా
మనతెలుగుతల్లినీ
సన్నుతించెదమా ||తీయ||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment