కవనోత్సాహం


పెదవులు

కదలటంలేదు

పలుకులు

పెగలడంలేదు


కన్నులు

తెరుచుకోవటంలేదు

దృశ్యాలు

కనుబడటంలేదు


చెవులు

వినటంలేదు

శ్రావ్యత

దొరకటంలేదు


కలము

వ్రాయటంలేదు

పుటలు

నిండటంలేదు


అందాలు

అగుపించుటంలేదు

ఆనందాలు

కలిగించటంలేదు


విరులు

వికసించటంలేదు

సువాసనలు

వెదజల్లటంలేదు


కానీ

ఆలోచనలు

ప్రవహిస్తున్నాయి

విషయాలు

వెంటబడుతున్నాయి


ఉల్లము

ఉబలాటపడుతున్నది

రాతలు

చేబట్టమంటున్నది


మానసము

పరుగెత్తుతున్నది

మాటలను

పట్టుకోమంటున్నది


కవనోత్సాహం

వీడకున్నది

కవితాజననం

కోరుచున్నది


నూతనకవితలు

నిత్యమూముందుంచుతా

నాణ్యతాప్రమాణాలు

సత్యంగానిలబెడతా


కయితలను

ఆస్వాదించండి

కవులను

గుర్తుంచుకోండి 


ఉండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog