ఎలా చెప్పను?
(కవిగారి హృదయస్పందనలు)
ఎన్ని చెట్లు
పూచాయో
ఎన్ని పూలు
రాలాయో
ఎన్ని సుకుమారాలు
నలిగాయో
ఎన్ని గర్భాలు
ఫలించాయో
ఎన్ని శిశువులు
జన్మించారో
ఎన్ని మరణాలు
సంభవించాయో
ఎన్ని పుష్పాలు
తెంచబడ్డాయో
ఎన్ని సుమాలు
కట్టబడ్డాయో
ఎన్ని కుసుమాలు
గుచ్చబడ్డాయో
ఎన్ని దేహాలు
చెమటోడ్చాయో
ఎన్ని గుండెలు
ఆగిపోయాయో
ఎన్ని హృదయాలు
పగిలిపోయాయో
ఎన్ని పూరేకులు
రాలాయో
ఎన్ని చేతులు
తెంచాయో
ఎన్ని కాళ్ళు
త్రొక్కాయో
ఎన్ని అంగాలు
తెగాయో
ఎన్ని కళ్ళు
మూతబడ్డాయో
ఎన్ని కాళ్ళు
చతికలబడ్డాయో
సత్యాలు
దాచలేను
అబద్ధాలు
చెప్పలేను
బాధను
భరించలేను
బాధలు
వర్ణనాతీతము
నిజాలు
నిష్ఠూరము
భావాలు
దాచటమసాధ్యము
ఏమి చేయను
ఎలా చెప్పను
ఎలా వ్రాయను
ఎలా ఆలోచించను
ఎలా స్పందించను
ఎలా మౌనందాల్చను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment