వానవస్తే! వరదవస్తే!


వానవస్తే 

భూమికి సంబరం 


మబ్బులులేస్తే 

రైతులకు ఆనందం 


చినుకులురాలితే

విత్తనాలకు పర్వదినం 


వానచుక్కలుతడిపితే  

చిన్నారులకు సంతోషం 


జల్లులుచల్లితే 

వాగులువంకలకు ఆనందం 


సెలయేర్లుపారితే

చూపరులకు పరవశం 


మేఘాలురవినికప్పితే 

ఎండతో దోబూచులు 


మబ్బులుశశినికమ్మితే 

వెన్నెలది వింతదర్శనం  


గాలివానవీస్తే 

జనాలకు భయం 


వరదపారితే 

కుంటలుకాలువలకు భోజనం 


వర్షంచాటేస్తే 

హర్షానికి చుక్కెదురు 


వానా కరుణించవమ్మా 

తాపాన్ని తగ్గించవమ్మా 


వరుణదేవుడా పుడమినిపచ్చబరచవయ్యా 

ప్రజలను కరువుకాటకాలనుండికాపాడవయ్యా 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog