నా తెలుగు


తియ్యనైనది నా తెలుగుభాష

తేటయైనది నా తెలుగుభాష

తేనెలుచిందేది నా తెలుగుభాష

తెల్లారివెలుగు నా తెలుగుభాష               ||తియ్య|


అకారాంతమైనది నా తెలుగుభాష

అనేకాక్షరాలున్నది నా తెలుగుభాష

అమృతంలాంటిది నా తెలుగుభాష

అమ్మలాబహుగొప్పది నా తెలుగుభాష


ఉగ్గుపాలతో వచ్చింది  నా తెలుగుభాష

ఉయ్యాలూపులలో నేర్చింది నా తెలుగుభాష

గానానికి యోగ్యమైనది నా తెలుగుభాష

శ్రావ్యతకి పేరొందినది నా తెలుగుభాష          ||తియ్య||


నన్నయ్య గ్రాంధీకరించింది నా తెలుగుభాష

పోతన్న సొబగులుదిద్దింది నా తెలుగుభాష

గురజాడచేతిలో వ్యావహారికమైనది నా తెలుగుభాష

కందుకూరికలంతో నవలగావతరించింది నా తెలుగుభాష


విశ్వనాధచే విఖ్యాతిపొందినది నా తెలుగుభాష

శ్రీశ్రీచేత మార్పులుసంతరించుకుంది నా  తెలుగుభాష

దాశరధిద్వారా దేదీప్యమానమైనది నా తెలుగుభాష

సినారెచేతిలో పరిపక్వమైనది నా తెలుగుభాష      ||తియ్య||


త్యాగయ్యకృతులతో శ్రావ్యమైనది నా తెలుగుభాష

అన్నమయ్యకీర్తనలతో శ్రేష్ఠమైనది నా తెలుగుభాష

రామదాసుపాటలతో రమ్యనైనది నా తెలుగుభాష

ఘంటసాలగళంతో ఘనమైనది నా తెలుగుభాష


పద్యకవితలతో ప్రత్యేకమైనది నా తెలుగుభాష

వచనకైతలతో వర్ధిల్లుచున్నది నా తెలుగుభాష

కవిసమ్మేళనాలతో కమ్మనైనది నా తెలుగుభాష

దేశవిదేశాలలో దివ్యమైనది నా తెలుగు భాష      ||తియ్య||


దేశబాషలందు లెస్సయినది నా తెలుగుభాష

విదేశాలలందు వ్యాపిస్తున్నది నా తెలుగుభాష

కవితాసుమాలను కురిపించేది నా తెలుగుభాష

సుమసౌరభాలను వెదజల్లేది నా తెలుగుభాష       


విప్లవసాహిత్యాన్ని వెల్లడిస్తున్నది నా తెలుగుభాష

భక్తీతత్వాన్ని బోధిస్తున్నది నా తెలుగుభాష

సమాజరుగ్మతలను సరిచేయిస్తున్నది నా తెలుగుభాష

సక్రమమార్గాలను సూచిస్తున్నది నా తెలుగుభాష    ||తియ్య||


నాలుకలలో నానుచున్నది నా తెలుగుభాష

మదులలో మెదులుచున్నది నా తెలుగుభాష

పుస్తకాలలో నిక్షిప్తమౌతున్నది నా తెలుగుభాష

మస్తిష్కాలలో నిలిచిపోతున్నది నా తెలుగుభాష


విశ్వమంతా వ్యాపిస్తున్నది నా తెలుగుభాష

విన్నూతనంగా ఎదుగుచున్నది నా తెలుగుభాష

భావకయితలందు బాసిల్లుచున్నది నా తెలుగుభాష

సాహితీజగతినందు సవ్వడిచెస్తున్నది నాతెలుగుభాష  ||తియ్య||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాయనగరం


Comments

Popular posts from this blog