తెలుగంటే


తెలుగంటే

మధురభాషోయ్

తెలుగంటే

తేటభాషోయ్     


తెలుగంటే 

అమృతంబోయ్

తెలుగంటే 

చెరకురసమోయ్            ||తెలు||


తెలుగంటే

త్రుళ్ళింతలోయ్

తెలుగంటే

కేరింతలోయ్ 


తెలుగంటే

ఓప్రాంతంకాదోయ్

తెలుగంటే

అఖిలాండమోయ్            ||తెలు||      


తెలుగంటే

అ ఆ అక్షరాలోయ్

తెలుగంటే

గుండ్రటి ముత్యాలోయ్


తెలుగంటే

అమ్మా ఆవులోయ్

తెలుగంటే

అంతా వెలుగులోయ్          ||తెలు||


తెలుగంటే

సుశబ్దాలోయ్

తెలుగంటే

సుస్వారాలోయ్


తెలుగంటే

పున్నమోయ్

తెలుగంటే

వెన్నెలోయ్                 ||తెలు||


తెలుగంటే

దివ్వెలోయ్

తెలుగంటే

జ్యోతులోయ్


తెలుగంటే

మట్టినేలకాదోయ్

తెలుగంటే

రత్నగర్భమోయ్           ||తెలు||


తెలుగంటే

వేషముకాదోయ్

తెలుగంటే

చక్కదనమోయ్


తెలుగంటే

జాతొకటేకాదోయ్

తెలుగంటే

కళాకాంతులోయ్         ||తెలు||


తెలుగంటే

ప్రఖ్యాతేకాదోయ్

తెలుగంటే

విశ్వవిఖ్యాతోయ్ 


తెలుగంటే

వట్టిమాటలేకాదోయ్

తెలుగంటే

తీపితేనెచుక్కలోయ్      ||తెలు|| 


తెలుగంటే

పద్యగద్యాలోయ్

తెలుగంటే

వచనకవితాగేయాలోయ్


తెలుగంటే

బహురూపాలోయ్

తెలుగంటే

పలుప్రక్రియలోయ్        ||తెలు||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog