మన తెలుగు
వెలుగుతుంది
తెలుగు
వ్యాపిస్తుంది
తెలుగు
వర్ధిల్లుతుంది
తెలుగు
శోభిల్లుతుంది
తెలుగు
వ్రాయిస్తుంది
తెలుగు
పాడిస్తుంది
తెలుగు
పువ్వులుపూస్తుంది
తెలుగు
పరిమళాలుచల్లుతుంది
తెలుగు
ఆకర్షిస్తుంది
తెలుగు
ఆహ్వానిస్తుంది
తెలుగు
మదినిమీటుతుంది
తెలుగు
హృదినితట్టుతుంది
తెలుగు
తీపినిస్తుంది
తెలుగు
స్ఫూర్తినిస్తుంది
తెలుగు
పలికిస్తుంది
తెలుగు
మురిపిస్తుంది
తెలుగు
వినమంటుంది
తెలుగు
విందునిస్తుంది
తెలుగు
ఖ్యాతినిస్తుంది
తెలుగు
సత్కారాలిస్తుంది
తెలుగు
చక్కగనుంటది
తెలుగు
శ్రావ్యంగుంటది
తెలుగు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment