ఆలుమగలవంతులు

(గేయం)


వంతు వంతు వంతు

మామధ్యన వంతు

కాపురంలో వంతు

జీవితంలో వంతు          ||వంతు||


వ్రాయటం నావంతు

పాడటం తనవంతు

చెప్పటం నావంతు

వినటం తనవంతు         ||వంతు||

 

వండటం తనవంతు

తినటం నావంతు

సంపాదన నావంతు

ఖర్చుపెట్టుట తనవంతు      ||వంతు||


పిల్లలుకనటం తనవంతు

పోషించటం నావంతు

ముస్తాబవటము తనవంతు

మురిచిపోవుట నావంతు     ||వంతు||


ఇల్లునుచూడటం తనవంతు

ఇంటినిజరపటం నావంతు

ముగ్గులేయటం తనవంతు

ముద్దుచేయటం నావంతు    ||వంతు||


అందంచూపటం తనవంతు

ఆనందించటం నావంతు

ఇంటిపెత్తనం తనవంతు

బయటపెత్తనం నావంతు     ||వంతు||


పిల్లలు పిల్లలు పిల్లలు

అమ్మానాన్నల చూడండి

లోకాన్ని వీక్షించండి

విఙ్ఞానాన్ని పొందండి       ||వంతు||


బాలలు బాలలు బాలలు

అనురాగాలు చూపండి

అన్యోన్యంగా ఉండండి

ఆదర్శంగా బ్రతకండి       ||వంతు||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog