కన్నెమనసు(ప్రేమగీతం)


పూవల్లె ఉన్నావు

విప్పారమన్నాడు

బొమ్మల్లె ఉన్నావు

ఉండిపొమ్మన్నాడు             ||పూవల్లె||


చిలుకలా ఉన్నావు

మాట్లాడమన్నాడు

కోకిలలా ఉన్నావు

గళమెత్తమన్నాడు


నెమలిలా ఉన్నావు

నాట్యమాడన్నాడు

హంసలా ఉన్నావు

హొయలుచూపన్నాడు           ||పూవల్లె||


దివ్వెలా ఉన్నావు

వెలిగిపోమన్నాడు

గువ్వలా ఉన్నావు

జతకురమ్మన్నాడు


నవ్వుతూ ఉన్నావు

నెరజాణవన్నాడు

కన్నుకొడుతున్నావు

కోమలాంగివన్నాడు             ||పూవల్లె||


సిగ్గువద్దన్నాడు

ముగ్గులోకిదించాడు

చుక్కలాగున్నావు

చుంబించమన్నాడు


మల్లెలాగున్నావు

మత్తెక్కించమన్నాడు

ఎర్రగా ఉన్నావు

బంగారానివన్నాడు             ||పూవల్లె||


గులాబివన్నాడు

గుచ్చవద్దన్నాడు

అందంగవున్నావు

అలరించమన్నాడు


చక్కెరలాగున్నావు

చవిచూపమన్నాడు

చిన్నగాయున్నావు

ఎదగమనియన్నాడు              ||పూవల్లె||


నమ్మమనియన్నాడు

అభయహస్తమిచ్చాడు

కలతవద్దన్నాడు

వెంటనడవమన్నాడు


లక్ష్మిలా ఉన్నావు

సిరులుతెమ్మన్నాడు

వాగ్దేవినన్నాడు

వాక్కులిమ్మన్నాడు               ||పూవల్లె||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog